ADB: ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఆదివారం వివిధ సంఘాల నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్థానిక ప్రజలు తనకు కొండంత అండగా నిలిచారని ఆమె కొనియాడారు. ప్రజల తోడ్పాటు వల్లే విధి నిర్వహణ సులభమైందని, ఏజెన్సీ అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు.