బద్వేల్ పట్టణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సూపర్ సిక్స్ మెగా క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నర్సింహారెడ్డి ఆదివారం బహుమతులు అందజేశారు.రెడ్డయ్య మఠం వీధి క్రికెట్ గ్రౌండ్ లో ఈనెల 12వ తేదీ నుండి జరిగిన ఈ టోర్నమెంట్లో బద్వేల్ దీపక్ డ్రైవింగ్ స్కూల్ ప్రథమ ఊరుబిండి జీవన్ రెడ్డి టీం ద్వితీయ బహుమతి గెలుచుకున్నాయి.