KDP: సిద్ధవటం హైలెవెల్ వంతెనపై నుంచి పెన్నానదిలోకి దూకి శిరీష అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో సురక్షితంగా బయటపడింది. ఆమెకు వివాహమై 15 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం లేకపోవడంతో మానసిక వేదనకు లోనై ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను విచారించి, అనంతరం బంధువులకు అప్పగించారు.