HYD: అత్యధిక వేగం ప్రాణాలను తీస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత మూడు సంవత్సరాల్లో ORRపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200కు పైగా మంది మృతి చెందారు. ముఖ్యంగా రాత్రివేళల్లో స్పీడ్ లిమిట్లు పాటించకపోవడం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.