ఏపీ జెన్కో ఎండీగా పొగాకు పుల్లారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం APCPDCL ఛైర్మన్ అండ్ ఎండీగా ఉన్న పొగాకు పుల్లారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ జెన్కో ప్రస్తుత ఎండీ ఎస్.నాగలక్ష్మి 180 రోజులు సెలవు పెట్టడంతో పుల్లారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సెలవుల అనంతరం నాగలక్ష్మి కొనసాగుతారు.