NZB: హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిరి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన శివం డ్యాన్స్ అకాడమీ చిన్నారులు నాట్య ప్రదర్శనలో పాల్గొని ప్రశంశలు, జ్ఞాపికలను అందుకున్నారు. కార్యక్రమంలో గురువు కుమారి గుజరాతి స్వాతి, చిన్నారులు కోడి చర్ల అనన్య, సాత్విక తదితరులు పాల్గొన్నారు.