KDP: వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ గోడపై, యుద్ధంలో కవచం లేదా శిరస్త్రాణం ధరించకపోతే ప్రమాదమని తెలియజేసే అరుదైన కుడ్యశిల్పం దర్శనమిస్తోంది. వందల ఏళ్ల క్రితమే శిల్పులు తమ కళా నైపుణ్యంతో భద్రతా సందేశాన్ని శిల్పాల రూపంలో ప్రాచుర్యం కల్పించారని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు.