TG: హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు దివంగత సీఎం, సీనియర్ సినీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్బంగా సమాధి వద్ద అభిమానులు నివాళులర్పించారు. ట్రస్టు నిర్వాహకులు సమాధిని పూలతో అలంకరించారు. ఘాట్ పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. అలాగే, ఏపీ మంత్రి లోకేష్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.