సత్యసాయి: ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రజల సమస్యలను విన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలపై వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి జనసేన ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు.