బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. దాదాపు 112 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణం తర్వాత కమెడియన్ గిల్లి నటా విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. రక్షితా శెట్టి రన్నరప్‌గా నిలిచారు. గిల్లికి రూ.50 లక్షల ప్రైజ్ మనీ లభించగా హోస్ట్ కిచ్చా సుదీప్ వ్యక్తిగతంగా మరో రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.