ATP: పామిడిలో ఈనెల 20 నుంచి జిల్లాస్థాయి మట్టి కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు శాప్ కోచ్ రాఘవేంద్ర సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హతగల వారు ఆధార్ కార్డు, జనన ధృవీకరణపత్రం, క్రీడా సామగ్రితో హాజరుకావాలన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో చిలకలూరుపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.