AP: విజయనగరం జిల్లా అప్పన్నవలస వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో రోడ్డు పక్కనే బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు రాజాం నుంచి విజయనగరం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.