AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్ చెప్పారు. ఈనెల 23న రైతులకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. సీఆర్డీఏకు భూములిచ్చి ప్లాట్లు పెండింగ్లో ఉన్నవారికి లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్లాట్లు పొందిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.