ATP: గుంతకల్లుకు చెందిన నవీన్ అనే వ్యక్తి పేగు సంబంధిత సమస్యతో శస్త్రచికిత్స చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గోవర్ధన్ అనే వ్యక్తి మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. బాధితుడికి త్వరితగతిన సాయం అందేలా తన కార్యాలయం అధికారులతో సమన్వయం చేస్తోందని లోకేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా భరోసా ఇచ్చారు.