GNTR: గుంటూరు తూర్పులో శనివారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 11మందికి గుంటూరు జిల్లా న్యాయస్థానం 7 రోజుల పాటూ జైలు శిక్ష విధించింది. ఒకరికి రూ.10 వేలు, నలుగురికి రూ.7వేలు, మరో నలుగురికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.58వేలు జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.