MNCL: ఈనెల 25న 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఓటర్ దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. “నా భారత్ -నా ఓటు” అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు.