SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఆధ్వర్యంలో నాయకులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గోవిందరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం నిరుపేదలకు పండ్లు వస్త్రాలను పంపిణీ చేశారు.