MHBD: సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనను పురస్కరించుకుని ఆదివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కాంగ్రెస్ నాయకులు మేడారంకు బస్సులలో తరలి వెళ్లారు. ఇట్టి బస్సులను కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కర్ర జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేడారం అభివృద్ధి చెందుతుందని అన్నారు.