AP: రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో జగన్ హయాంలో అరాచకాలు జరిగాయి. పాతకక్షల నేపథ్యంలోనే సాల్మన్ హత్య జరిగింది. కుల రాజకీయాలను జగన్ రెచ్చగొడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు.. జగన్ సీఎం అయ్యేది లేదు’ అంటూ విమర్శించారు.