NLG: హైదరాబాద్ నగరంలో ఈ నెల 25 నుంచి 28 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల ప్రారంభ రోజు 25వ తేదీన నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.