KMM: చలికాలం, పండుగ సీజన్ కారణంగా చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే సంక్రాంతి అనంతరం కూడా చికెన్ ధరల్లో మార్పులు కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో స్కిన్లెస్ చికెన్ కేజీ రూ. 302కు చేరుకోగా, కేజీ స్కిన్ చికెన్ ధర రూ. 265 ఉంది. అయితే ఉత్పత్తి ఖర్చులు పెరగడం, డిమాండ్ తగ్గకపోవడం దీనికి కారణాలుగా తెలుస్తుంది.