అనకాపల్లి పట్టణం ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ వర్ధంతిని ఇవాళ నిర్వహించారు. టీడీపీ కార్య నిర్వాహ కార్యదర్శి దాడి రత్నాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం టీడీపీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.