NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 99 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. వారిని కోర్టుల్లో హాజరు పరచడంతో ముగ్గురికి వారం రోజుల పాటు జైలు శిక్షతోపాటు రూ.5,80,000 జరిమానా విధించారన్నారు. కాగా, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు.