RR: షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కేశంపేట, కొందుర్గు మండలాల అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 10 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే రహదారి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రగతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.