ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన నార్నూర్ మండలం అభివృద్ధి చెందడం హర్షణీయంగా ఉందని ఎంపీ గోడం నగేష్ కొనియాడారు. కేంద్ర నీతి ఆయోగ్ ద్వారా మండలంలోని ఖైర్డాట్వ మొవ్వ లడ్డు యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన మొవ్వ లడ్డు కేంద్ర సభ్యురాలు శాంతాబాయి శ్రీనివాస్ దంపతులకు రాష్ట్రపతి భవనం నుంచి ఆహ్వానం రావడం గర్వంగా ఉందన్నారు.