సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే (100*) అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని అలెన్ నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.