SRPT: రెడ్లకుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడవద్దని మే నెల చివరి వరకు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కోదాడ మండలంలోని పాలేరు వాగుపై రెడ్లకుంట వద్ద నిర్మిస్తున్న రెడ్ల కుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు పరిశీలించారు.