SS: జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో 2026-27 సంవత్సరానికి గాను జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ‘పుట్టపర్తి సమాచార్’ దినపత్రిక ఎడిటర్ గోగుల చక్రపాణికి అక్రిడిటేషన్ కార్డు అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పత్రికల పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.