E.G: కానూరు నుంచి ఉసులుమర్రు వరకు నూతనంగా నిర్మించిన ఆర్&బీ ప్రధాన రహదారిని ఇవాళ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. రహదారి నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలు, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచడమే తన లక్ష్యమని, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు.