KKD: తుని రైల్వే స్టేషన్లో వందే భారత్ సహా మూడు ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు ఇచ్చింది. వందే భారత్ (సికింద్రాబాద్ – విశాఖ), ఎల్టీటీ, ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై తునిలో ఆగనున్నాయి. వచ్చే నెల నుంచి ఈ హాల్ట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.