నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కల్కి’ సీక్వెల్గా ‘కల్కి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై నటి దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘కల్కి 2’లో తన పాత్ర నిడివి మొదటి భాగంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే తొలి భాగంలో ‘రోక్సీ’ అనే పాత్రలో మెరిసిన దిశా, రెండో భాగంలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.