కృష్ణా: గుడ్లవల్లేరు ఏఎఎన్ఎం పాఠశాల విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్, శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ.. బాలికలు ధైర్యంగా ఉండి ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే 112కు డయల్ చేయాలని, షీటీం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమాజంలో మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యతమైనదని, ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.