SKLM: అంతర్జాతీయ మహిళా వారోత్సవాల భాగంగా అక్షరాస్యత సాధన లక్ష్యంగా ఆమదాలవలస మున్సిపాలిటీలోని అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ప్రీ ఫైనల్ పరీక్షలు రాశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శత శాతం అక్షరాస్యత సాధనలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రవి పరిశీలించారు.