BDK: జిల్లాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఏటీసీ కళాశాలల నిర్మాణానికి సంబంధించి స్థల సమీకరణ, అవసరమైన అనుమతుల పురోగతిపై కలెక్టర్ అంకిత్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆలస్యం లేకుండా అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.