సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ తనను బాధించలేదని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పింది. స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆమె.. తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై స్పందించింది. తన పెళ్లికి రూ.800 కోట్లు ఖర్చు అయ్యిందని వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నానని, అన్ని కోట్లు ఉంటే తాను ఇక్కడ ఎందుకు ఉంటానని చమత్కరించింది.