AP: శ్రీవారిపై గతంలో జగన్ ప్రభుత్వం కక్షగట్టిందని MLC పంచుమర్తి అనురాధ ఆరోపించారు. లడ్డూ కల్తీ అంశంపై శాసనమండలిలో ఆమె మాట్లాడారు. ‘అనేక భయంకరమైన రసాయనాలు కలిపి ఉన్నవాటికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారు. టర్నోవర్ ఏడాదికి రూ.250 కోట్లు అని ఉన్న నిబంధనను రూ.150 కోట్లకు పరిమితం చేశారు. జగన్, TTD మాజీ ఛైర్మన్లు భూమన, YV సుబ్బారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు’ అని పేర్కొన్నారు.