TG: సింగూరు ప్రాజెక్టు పరిరక్షణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు డ్యామ్ పరిరక్షణ పనులను వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టెక్నికల్ కమిటీని నియమించాలని మంత్రులు సూచించారు. జూన్ 26లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.