ASR: రైతును రాజుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనని అరకు టీడీపీ ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర అన్నారు. డుంబ్రిగూడ మండలం బోసువలసలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్హులైన రైతులకు పాస్ పుస్తకలను పంపిణీ చేశారు. మండలం మొత్తం 204 పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు తహసీల్దార్ త్రివేణి తెలిపారు.