VZM: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రం లోనూ, నియోజకవర్గం స్థాయి లోనూ కూడా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. పోలీస్ బ్యారెక్స్‌లో నిర్వహించే ఈ ఉత్సవాలకు సుమారు 3 వేల మంది వరకు మహిళలు హాజరవుతారని సంబందించిన ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.