KDP: జిల్లాలో చైన్ స్నాచింగ్ కేసులపై ఎస్పీ విశ్వనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు నమోదైన 12 కేసుల్లో 5 కేసులను ఛేదించి రూ.5.35 లక్షల విలువైన బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5877 సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుండగా, మిగిలిన కేసులను చేధించేందుకు ప్రత్యేక బృందాలు చేస్తున్నాయని తెలిపారు.