ADB: ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై సోమవారం హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.