SRD: కంగ్టి మండలం తడ్కల్ జామ మసీదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మస్తాన్ సాబ్ ముస్లిం సోదరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉప వాస దీక్ష విడిపించారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.