CTR: శ్రీరంగరాజపురం మండలంలోని కొత్తపల్లి మిట్ట జడ్పీ ఉన్నత ప్లస్ పాఠశాలను డీఈవో రాజేంద్రప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన విధానం, హాజరు నమోదులు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించి ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.