గుంటూరు ఆర్టీసీ డిపో-2లోని నిర్బంధంలో ఉన్న 71 వాహనాలను ఈ నెల 15వ తేదీలోపు యజమానులు విడిపించుకోవాలని బుధవారం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె. సీతారామి రెడ్డి సూచించారు. నిర్ణీత గడువులోగా యజమానులు స్పందించకపోతే, మోటారు వాహనాల నిబంధన 8, సబ్ రూల్ 8 ప్రకారం ఆ వాహనాలను బుడంపాడులోని హిందూస్తాన్ రీసైక్లింగ్ హబ్‌కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.