ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్జీపీటీకి ఊహించని షాక్ తగులుతోంది. ఏకంగా 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని బాయ్ కాట్ చేశారు. అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం వల్లే యూజర్లు బాయ్ కాట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ ఏఐ తన ఏఐ మోడళ్లను అమెరికా రక్షణ శాఖ రహస్య నెట్వర్క్లలో ఉపయోగించుకునేలా గత వారం ఒక ఒప్పందంపై సంతకం చేసింది.