AP: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండగా.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి.