NRML: పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ కావ్య, వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తిలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లికి విన్నవించారు. బుధవారం మంత్రి కార్యాలయంలో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధితో పాటు శ్యామఘడ్, బత్తిస్ ఘడ్లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.