ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో కెప్టెన్ శాంట్నర్ ఛేజింగ్‌కే మొగ్గుచూపాడు. ఇప్పటివరకు T20 WCల్లో కివీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ICC నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం కివీస్‌దే పైచేయిగా ఉంది.