VKB: జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్ రైల్వే గేటు ప్రతి అరగంటకోసారి పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రానగర్, రామయ్య గూడ, అనంతగిరిపల్లి తదితర గ్రామాల వైపు వెళ్లే వాహనాలు ఇక్కడ భారీగా నిలిచిపోతున్నాయి. ఎండ, వానల నుంచి రక్షణ పొందేందుకు రైల్వే అధికారులు వెంటనే స్పందించి గేటుకు ఇరువైపులా షెడ్లు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.