KMR: నాగిరెడ్డిపేటలోని మాల్తుమ్మెద తండాకు చెందిన హారిక మోడల్ స్కూల్ ఇంటర్లో 970 మార్కులు సాధించిన సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల ఎస్సై భార్గవ్ గౌడ్, పోలీస్ సిబ్బంది శాలువతో ఘనంగా సన్మానించారు. హారిక పూరిగుడిసెలో నివసిస్తూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, చదువుకోవాలని పట్టుదలతో మండలంలోనే టాపర్గా నిలిచి ఆదర్శమయ్యారు. నేడు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ అభినందించారు.